శ్రీ రాజ రాజేశ్వరీ దేవిగా అమ్మవారు

651చూసినవారు
శ్రీ రాజ రాజేశ్వరీ దేవిగా అమ్మవారు
నిండ్ర మండలం కూనమరాజుపాలెం శ్రీ మహాలక్ష్మీ అమ్మవారి దేవస్థానంలో దసరా ఉత్సవాల్లో భాగంగా సోమవారం అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. పండ్లు పుష్పమాలలు నైవేద్యాలతో అమ్మవారు అత్యంత వైభవంగా దర్శనమిచ్చారు. ఆలయ ప్రధాన అర్చకులు మహిళలచే కుంకుమార్చన ఉభయదారులచే మహా హోమం నిర్వహించి అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవారి పూజలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్