మాజీ సైనికులకు సన్మానం

54చూసినవారు
మాజీ సైనికులకు సన్మానం
కార్గిల్‌ యుద్ధంలో వీరోచితంగా పోరాడిన అమరులందరినీ స్మరించుకుంటూ నగరి పట్టణంలో కార్గిల్‌ విజయ్‌ దివస్‌ను శుక్రవారం నిర్వహించారు. నగరి బస్టాండ్‌ నుండి ఓం శక్తి ఆలయం వరకు ర్యాలీ నిర్వహించారు. బీజేపీ నాయకుడు మునిక్రిష్ణమ నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీలో బీజేపీ నేతలు, స్థానికులు పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం దేశం కోసం పోరాడి విశ్రాంతి పొందిన మాజీ సైనికులకు దుస్సాలువలు వేసి షీల్డులు ఇచ్చి సత్కరించారు.

సంబంధిత పోస్ట్