కొలమాసనపల్లి పంచాయతీ గొల్లపల్లికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు భాస్కర్ తండ్రి వెంకటప్ప మృతదేహానికి మాజీ మంత్రివర్యులు అమర్నాథ్ రెడ్డి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా మృతుని కుటుంబీకులను తన ప్రగాడ సంతాపాన్ని తెలియజేసి సానుభూతిని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు మండల పార్టీ అధ్యక్షులు నాగరాజు రెడ్డి, మాజీ సర్పంచ్ సెల్వరాజ్, కార్యదర్శి గణేష్ తదితరులు పాల్గొన్నారు.