పలమనేరు రేంజ్ లోని సరిహద్దు ప్రాంతాల రైతులు రాత్రిపూట అప్రమత్తంగా ఉండాలని ఫారెస్టు అధికారులు బుధవారం తెలిపారు. మొగిలి, గౌరీశంకరపురం, మొగిలివారిపల్లి, టేకుమంద, జయంతి, మామిడిమానుకుంట, కుంటి ఆవులకుంట, కొదలమడుగు, కీరమంద, బండ్లదొడ్డి, సామిచేనుమిట్ట గ్రామస్థులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. శివపార్వతుల గోశాల వద్ద సంచరించి అడవిలోనికి ఒంటరి ఏనుగు వెళ్లినట్లు తెలిపారు.