వాల్మీకేతురాలైన బొజ్జమ్మను రాష్ట్ర వాల్మీకి ఫెడరేషన్ ఛైర్మన్ గా నియమించడం పట్ల వాల్మీకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆదివారం పలమనేరు ఆర్అండ్ బి గెస్ట్ హౌస్ వద్ద వాల్మీకులు సమావేశం నిర్వహించారు. వాల్మీకి సమస్యల కోసం గత కొన్నేళ్లుగా ఉద్యమాలు చేస్తున్న వారిని విస్మరించి పాల ఏకిరికి చెందిన బొజ్జమ్మను నియమించడం ఎంతవరకు సబబని వారు ప్రశ్నించారు. భాస్కర్, నాగరాజు, గంగప్ప, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.