చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం ఓటేరిపాలెం గ్రామానికి చెందిన ఓ విద్యార్థిని డెంగ్యూ జ్వరంతో మృతి చెందినట్లు శనివారం కుటుంబ సభ్యులు తెలిపారు. గుణశేఖర్ కుమార్తె రక్షిత 6వ తరగతి చదువుతోంది. పది రోజులుగా జ్వరంతో బాధపడుతోంది. ఎంతకీ జ్వరం తగ్గకపోవడంతో తిరుపతి రుయాకు తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ శనివారం మృతి చెందినట్లు కుటుంబీకులు పేర్కొన్నారు.