కష్టతరంగా మారిన గ్రామీణ ప్రాంత రోడ్డు ప్రయాణాలు

5880చూసినవారు
బైరెడ్డిపల్లి మండలంలోని క్రైగల్, రామసముద్రం, ఎం. కొత్తూరు, సనిపల్లి, మునిపల్లి, మొగిలి పదరేవులు గ్రామాలకు రోడ్డు నిర్మాణం అస్తవ్యస్తంగా, విస్తరణ పేరుతో కొన్ని సంవత్సరాలుగా కాలయాపనం చేస్తూ, సమీప గ్రామాల ప్రజల రాకపోకలకు కష్టతరం గా మారింది. గ్రామాల్లో ఆరోగ్య సమస్యలు తలెత్తిన కనీసం ద్విచక్రవాహనంలో హాస్పిటల్ చేరుకొనే పరిస్థితి లేదని రైతన్నలు వాపోతున్నారు. ఎన్నికల సమయాల్లో మాత్రం మా గ్రామ ప్రజల యోగ క్షేమాలు రాజకీయ నాయకులకు గుర్తొస్తుంది. మిగతా సమయాల్లో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే పడియునట్టు గ్రామాల్లో కనపడుతుంది. తెదేపా ప్రభుత్వం హయంలో రోడ్డు నిర్మాణం చేపట్టాలని కంకణం కట్టుకొని స్థానిక నాయకులు, గ్రామస్థుల సహకారంతో పనులు ముమ్మరం చేపట్టి, విస్తరణ చేపట్టి జల్లి వేశారు. ప్రభుత్వం మారడంతో నిర్మాణపు పనులు గాలికి వదిలేశారు. ఓట్లు దండుకోవడానికి వచ్చిన నాయకులు మా గ్రామాల అభివృద్ధిపై కనికరం చూపి సంవత్సరాలు గా పూర్తి కాని రోడ్డు నిర్మాణం చేపట్టాలని కోరారు. మండలంలోని ఉన్నత అధికారుల చొరవ అత్యవసరమని సమీప గ్రామస్థులు మొరపెట్టుకొంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్