పీలేరులో గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల ఇద్దరు యువకులు రైలు పట్టాలపై గంజాయి విక్రయిస్తూ ప్రమాదంలో మరణించడంతో ఎస్పీ ఆదేశాల మేరకు విచారణ చేపట్టారు. రాజీవ్ నగర్ కు చెందిన మహబూబ్ బాషా పలువురికి గంజాయి విక్రయిస్తున్నట్లు గుర్తించారు. అతనిని అరెస్టు చేసి 20 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.