బంగారుపాలెం మండలం మొగిలి శివాలయంలో మంగళవారం స్వయంభు శ్రీ మొగిలీశ్వర స్వామి వారికి అన్నాభిషేక కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం స్వామివారికి అభిషేకాలు, పూజలు చేపట్టారు. అనంతరం స్వామి వారి మూల విగ్రహానికి అన్నం తో అలంకరించి పూజలు చేశారు. తంబుగానీపల్లెకి చెందిన లోకనాథం నాయుడు ప్రమీలమ్మ దంపతులు ఉభయ దారులుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ఈవో కమలాకర్, వంశపారంపర్య ధర్మకర్త విజయకుమార్, ఆలయ అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.