బంగారుపాలెం మండలం మొగిలి శివాలయంలో సోమవారం రాహు కేతు పూజలను ఘనంగా నిర్వహించారు. పరిసర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు రాహు, కేతు, సర్ప దోష నివారణ పూజల్లో పాల్గొన్నారు. కార్తీక మాసం సందర్భంగా సోమవారం మొగిలి శ్వర స్వామి వారికి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈవో కమలాకర్, వంశపారంపర్య ధర్మకర్త విజయకుమార్, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.