చిత్తూరు: వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానానికి విరాళాల అందజేత
చిత్తూరు జిల్లా ఐరాల మండలం, చిన్నకంపల్లి చెందిన బాలకృష్ణా రెడ్డి పేరుతో వారి మనవళ్ళు దాతలు చైతన్య రెడ్డి, రోహిత్ రెడ్డి కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానానికి గో సంరక్షణ ట్రస్ట్ కి రూ. 5, 01, 116లను విరాళంగా ఆలయ అధికారులకు ఆదివారం అందజేశారు. వీరికి దర్శన ఏర్పాట్లు చేసి స్వామి వారి తీర్థప్రసాదాలు, శేష వస్త్రం అందజేసారు. కార్యక్రమంలో ఆలయ ఏఈవో రవీంద్రబాబు, సూపరిండెంట్ కోదండపాణి పాల్గొన్నారు.