పుంగనూరు నియోజకవర్గం మీదుగా కర్ణాటక రాష్ట్రానికి చెందిన భక్తులు కాలినడకన వందల సంఖ్యలో తిరుమలకు నడిచి వెళుతున్నారు. ఈ సందర్భంగా వారు సోమవారం ఉదయం చౌడేపల్లి, సోమల, సదుం మండలాల మీదుగా తమ పాదయాత్రను కొనసాగిస్తున్నారు. భక్తులు మాట్లాడుతూ వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని తాము పాదయాత్ర చేస్తున్నట్లు తెలిపారు. గత 30 సంవత్సరాలుగా ఇలా దైవ దర్శనానికి వెళుతున్నామన్నారు.