పుంగనూరు నియోజకవర్గంలోని పలు మండలాలలో శనివారం సాయంత్రం ఓ మోస్తరుగా వర్షం కురిసింది. గత వారం రోజుల నుంచి ఎండ విపరీతంగా కాయడంతో ఆ వేడికి ప్రజలు తట్టుకోలేకపోయారు. ఉదయం నుంచి ఎండ వచ్చినట్లే వచ్చి సాయంత్రం మేఘాలు చల్లబడి ఒక్కసారిగా వాతావరణంలో మార్పు చోటుచేసుకుని వర్షం కురిసింది. ఒక్కసారిగా వర్షం కురవడంతో ప్రజలు కాస్త ఇబ్బందులు ఎదుర్కొన్నారు.