గ్రామ పంచాయతీల అభివృద్ధి ప్రణాళిక 2025-26ను రూపొందించేందుకు పుంగనూరు నియోజకవర్గంలోని 6 మండలాలలో ఉన్న ఎంపీడీవో కార్యాలయాలలో శుక్రవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. 15వ ఆర్థిక సంఘం, సాధారణ, ఉపాధి హామీ పథకం నిధులతో పంచాయతీలలో చేపట్టే అభివృద్ధి పనులను గ్రామసభల ద్వారా ఎంపిక చేసుకోవాలని ఆయా మండలాల సిబ్బందికి సూచించారు. అంతేకాకుండా వాటిని ఆన్లైన్ లో తప్పనిసరిగా నమోదు చేయాలని సూచించారు.