మేకను హతమార్చిన వీధి కుక్కలు

67చూసినవారు
పుంగనూరు మండల పరిధిలోని మేలుందొడ్డి రోడ్డులో ఉన్న పాత సామాన్ల గుజిరిలోని మేకను ఆదివారం వీధి కుక్కలు హతమార్చాయి. గుజిరీలో ఉన్న హాల్లోకి దూరి ఓ మేక పై దాడి చేసి చంపేశాయి. ఈ ఘటన అక్కడి సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. తను పెంచుకుంటున్న మేక విలువ సుమారు రూ. 30 వేలు ఉంటుందని యజమాని రహమత్ తెలిపారు. వీధి కుక్కల దాడులు పట్ల అధికారులు ఇప్పటికైనా స్పందించుకుంటే ఎలా అని స్థానిక ప్రజలు వాపోతున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్