చిత్తూరు జిల్లా కేవీబీ పురం మండలంలో తెలుగుదేశం పార్టీ ఎంపీపీ అభ్యర్థి మల్లికార్జునరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఇవాళ తెల్లవారుజామున మల్లికార్జునరెడ్డి ఇంట్లో తనిఖీలు చేసిన పోలీసులు... మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. మద్యం సీసాలు ఉన్నట్లు ఫిర్యాదు రావడంతోనే తనిఖీలు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. అయితే గుర్తుతెలియని వ్యక్తులు తన ఇంట్లో మద్యం సీసాలు పెట్టినట్లు మల్లికార్జునరెడ్డి పోలీసులకు తెలిపారు. వైసీపీ నేతలే తన ఇంట్లో మద్యం సీసాలు ఉంచారని ఆరోపించారు. మల్లికార్జునరెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు పుత్తూరు డీఎస్పీ కార్యాలయానికి తరలించారు.