Jan 20, 2025, 15:01 IST/
జమ్మూ కాశ్మీర్ లో ఎన్కౌంటర్.. భారత జవాన్ వీరమరణం
Jan 20, 2025, 15:01 IST
జమ్మూ కాశ్మీర్ లో మరోసారి ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్ లో భారత ఆర్మీ జవాన్ పంగల కార్తీక్ వీరమరణం పొందారు. నార్త్ కాశ్మీర్లోని జలూరా సోపోరాలో ఇవాళ ఇస్లామిస్ట్ తీవ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఇందులో కార్తీక్ తీవ్రగాయాలపాలవడంతో ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. మరికొందరు జవాన్లకు గాయాలైనట్లు సమాచారం.