లివర్ దానం చేసి కన్నతండ్రికి పునర్జన్మనిచ్చిందో కూతురు. నిఖితా నాథ్ అనే 20 ఏళ్ల యువతి తన తండ్రికి కాలేయాన్ని డొనేట్ చేసింది. లివర్ సిర్రోసిస్ కారణంగా నిఖితా తండ్రి కాలేయం 85 శాతం పాడైంది. దీంతో తన కాలేయంలో 75 శాతం తండ్రికి దానమిచ్చింది. ఇది తన తండ్రికి తాను చేసిన చిన్న సాయం మాత్రమేనని నిఖితా చెప్పారు. సర్జరీ తర్వాత ఇద్దరం చాలా కష్టపడ్డాం.. కానీ, నాన్న నవ్వు చూశాక అన్నీ మర్చిపోయానని ఆమె తెలిపారు.