వరదయ్య పాలెం మండలం బత్తులవల్లం పాఠశాల ఆవరణలోని పాత వాటర్ ట్యాంక్ శిథిలావస్థకు చేరుకుంది. పంచాయతీ కార్యదర్శి ఇందిరకు సత్యవేడు నాయకుడు ఓడూరు ఉజ్వలరెడ్డి సోమవారం వినతిపత్రం సమర్పించారు. ఆయన మాట్లాడుతూ. వాటర్ ట్యాంక్ పెచ్చులూడి అడుగు భాగాన పడుతున్నాయని చెప్పారు. ట్యాంకు బాగు చేయడం లేదా కొత్తది నిర్మించాలని కోరారు.