కేవీబీపురం మండలం కోటమంగాపురం గ్రామంలో చిన్న వర్షానికే వీధులు జలమయమై గుంతల్లో నీరు నిలుస్తోంది. డ్రైనేజీలు లేకపోవడంతో వర్షపు నీరు వీధుల్లో నిల్వ ఉంటూ దోమలు వృద్ధి చెందుతున్నాయి. వీధులు బురదమయంగా దర్శనమిస్తున్నాయి. పంచాయతీ అధికారులు స్పందించి వీధుల్లో మురుగు నీరు నిల్వ లేకుండా చర్యలు తీసుకోవాలని బుధవారం స్థానికులు కోరుతున్నారు.