పిచ్చాటూరు మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా మహమ్మద్ రఫీ గురువారం బాధ్యతలు స్వీకరించారు. సాధారణ బదిలీలలో భాగంగా ఈయన వీ. కోట ఎంపీడీవోగా పనిచేస్తూ పిచ్చాటూరుకు బదిలీపై వచ్చారు. ఆయన మాట్లాడుతూ.. మండల ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందేలా చర్యలు తీసుకుంటానన్నారు. ప్రభుత్వ సంక్షేమం అభివృద్ధిని ప్రజలలోకి తీసుకువెళ్తామన్నారు.