శ్రీకాళహస్తి డివిజన్లో 2024లో 146 రోడ్డు ప్రమాదాలు జరగ్గా 65 మంది చనిపోయినట్లు ఆర్టీఓ దామోదర్ గురువారం నాయుడు తెలిపారు. ఈ ప్రమాదాలన్ని రోడ్లపై అవగాహన లేకే జరిగినట్లు ఆయన స్పష్టం చేశారు. అంతేకాకుండా తిరుమల దర్శనానికి వెళ్లే వారు అక్కడ సరైన విశ్రాంతి తీసుకోకుండా బయలుదేరడంతోనే ప్రమాదాల తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు ఆర్టీఓ తెలిపారు. డివిజన్ పరిధిలో ప్రతి వాహనదారుడు లైసెన్స్ కలిగి ఉండాలన్నారు.