రేణిగుంట పాత చెక్ పోస్ట్ సమీపంలో శనివారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో జయకుమార్, అతని భార్య సరస, కుమార్తె జాస్విన్ ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో మంటలు వెలుగులోకి వచ్చాయి. కేకలు విన్న పక్కన వారు చేరుకుని కాపాడారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు, కానీ ఇంట్లోని వస్తువులు, రూ. 50 వేలు నగదు, ఎలక్ట్రికల్ సామాను మొత్తం కాలిపోయింది. ఇప్పుడు కట్టుబట్టలతో వీధిలో ఉండి తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.