చిత్తూరు జిల్లాలో శ్రీకాళహస్తి మండలం కాపుగున్నేరి సచివాలయ ఇంజినీరింగ్ అసిస్టెంట్ రాజ్ కుమార్ గురువారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అతడు విధులు ముగించుకొని ఇంటికి వెళ్లుతుండగా తిరుపతి నుంచి శ్రీకాళహస్తి వైపు వెళ్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించగా మార్గమధ్యలో మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.