14న శ్రీకాళహస్తిలో జాతీయ లోక్ అదాలత్
శ్రీకాళహస్తి పట్టణంలోని కోర్టులో ఈనెల 14న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని గురువారం అదనపు జిల్లా జడ్జి శ్రీనివాస్ నాయక్ సూచించారు. సివిల్, క్రిమినల్, బ్యాంకు లావాదేవీలు, ఎన్ఐ యాక్ట్ కేసులను వాది, ప్రతివాది అంగీకారాలతో పరిష్కరిస్తామన్నారు. లోక్ అదాలత్ బెంచ్ తుది తీర్పన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.