తిరుపతి జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ బుధవారం శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేశారు. అక్కడి వైద్యసిబ్బందితో సమావేశమై వైద్యశాలలో పరిస్థితులపై చర్చించారు. వైద్యశాలలో మౌలిక వసతులపై ఆరా తీశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను జిల్లా కలెక్టర్ కలిసి వైద్య సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యాధికారులను ఆదేశించారు.