బంగాళాఖాతంలో మరికొన్ని గంటల్లో అల్పపీడనం ఏర్పడి.. అది కాస్తా వాయుగుండంగా మారనుందని కేంద్ర వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో ఒడిశా, ఛత్తీస్‌గఢ్, పశ్చిమబెంగాల్, బీహార్‌లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. దీని కారణంగా ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని ప్రకటించింది.