శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని కేంద్ర మంత్రి సురేష్ గోపి బుధవారం దర్శించుకున్నారు. మంత్రికి దేవస్థానం అభివృద్ధి కోసం రూ. 140కోట్లతోనూ, స్థానిక గుడిమల్లం ఆలయం అభివృద్ధి కొరకు రూ. 22 కోట్లతో ప్రతిపాదనలను ఎమ్మెల్యే బొజ్జలసుధీర్ రెడ్డి సూచనల మేరకు చెంచయ్య నాయుడు ప్రతిపాదన కేంద్రమంత్రికి అందించారు. సానుకూలంగా స్పందించిన మంత్రి ఆలయాల అభివృద్ధికి సహకరిస్తానని అన్నారు.