శ్రీకాళహస్తిలో భగ్గుమన్న రాజకీయ కక్షలు
శ్రీకాళహస్తి పట్టణంలోని చాముండేశ్వరి దేవి ఆలయ అధ్యక్షుడు పులి రామచంద్రయ్య, మున్సిపల్ మాజీ చైర్మన్ పార్థసారథి మధ్య ఆదివారం వాగ్వాదం చోటుచేసుకుంది. ఆలయం ఆవరణలో ఒకరికొకరు బూతులు తిట్టుకుంటూ కర్రలతో దాడి చేసుకోవడానికి ప్రయత్నించారు. అంతలో భక్తులు వారిని విడదీసే ప్రయత్నం చేశారు. కొన్ని రోజులుగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నట్లు సమాచారం.