శ్రీకాళహస్తిలోని భాస్కర్ పేట నందు చాముండేశ్వరి ఆలయంలో కమిటీ అధ్యక్షుడు (వైసీపీ) పులి రామచంద్రయ్య నవరాత్రుల వేడుకలు నిర్వహిస్తున్నారు. శనివారం విజయదశమి కావడంతో అమ్మవారిని దర్శించుకోవడానికి శ్రీకాళహస్తి పురపాలక సంఘం మాజీ చైర్మన్ పార్థసారధి (టీడీపీ) దేవాలయానికి వచ్చారు. ఈ క్రమంలో పార్థసారధి, రామచంద్రయ్యకు మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చేటుచేసుకుంది. వాగ్వాదం కాస్త గొడవగా మారి ఆలయం బయట ఉన్న చెప్పులు, కర్రలతో దాడులు చేసుకున్నారు.