విజయవాడ వరద బాధితులకు నాయుడుపేట వ్యాపారులు శనివారం తమ ఆర్థిక సహాయం అందించారు. నాయుడుపేట పాన్ బ్రోకర్స్ అండ్ బులియన్ మర్చంట్ అసోసియేషన్ వారు రూ. 1, 50, 000, నాయుడుపేట క్లాత్ మర్చంట్ అసోసియేషన్ వారు ఒక లక్ష రూపాయల చెక్కులను సూళ్లూరుపేట నియోజకవర్గం టీడీపీ ఇన్ ఛార్జ్ మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం, మాజీ ఏఎంసీ చైర్మన్ శిరసనంభేటీ విజయభాస్కర్ రెడ్డి లకు అందజేశారు.