విద్యుత్ వెలుగుల్లో తంబళ్లపల్లె ప్రభుత్వ కార్యాలయాలు

51చూసినవారు
ఏపీ ముఖ్యమంత్రిగా బుధవారం చంద్రబాబు ప్రమాణ స్వీకార మహోత్సవానికి తంబళ్లపల్లె పట్టణంలోని ఎంపీడీఓ, తహశీల్దార్ కార్యాలయాలు మంగళవారం రాత్రి ముస్తాబయ్యాయి. కలెక్టర్ ఆదేశాల మేరకు మండల పరిషత్, ఎంఆర్ఓ కార్యాలయాలను విద్యుత్ దీపాలతో సుందరంగా ముస్తాబు చేసినట్టు ఎంపీడీఓ కృష్ణమూర్తి, తహశీల్దార్ బ్రహ్మయ్య తెలిపారు. ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని లైవ్ టెలికాస్ట్ ద్వారా ప్రదర్శించనున్నట్టు వారు తెలిపారు.

సంబంధిత పోస్ట్