ఉత్తరప్రదేశ్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. భదోహిలో కొత్తగా పెళ్లయిన 20 ఏళ్ల మహిళపై రాహుల్ (28) అనే వ్యక్తి ఆమె ఇంట్లోనే అత్యాచారానికి పాల్పడ్డాడు. సోమవారం భర్త లేని సమయంలో ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ మేరకు బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో నిందితుడిపై భారతీయ న్యాయ సంహితలోని సంబంధిత సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.