విజయవాడలో భారీ వర్షం దంచికొడుతుంది. ఏకధాటిగా కురుస్తున్న వర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. అయితే ప్రజలు మరి కొన్ని గంటల పాటు రోడ్లపైకి రావొద్దని పోలీసుల హెచ్చరికలు జారీచేశారు. జాతీయ రహదారులపై ద్విచక్ర వాహనాలను అనుమతించ వద్దని పోలీసుల ఆదేశాలిచ్చారు. విజయవాడలోకి వచ్చే వాహనాలు దారి మళ్లించాలని తెలిపారు. పొట్టిపాడు టోల్ గేట్ వద్ద జాతీయ రహదారిపై వాహనాలు భారీగా నిలిచాయి.