భక్తి శ్రద్ధలతో రంజాన్ వేడుకలు..

553చూసినవారు
తంబళ్లపల్లె మండలంలో రంజాన్ వేడుకలను గురువారం ముస్లిం సోదరులు భక్తిశ్రద్దలతో ఘనంగా నిర్వహించారు. తంబళ్లపల్లె, సిద్ధారెడ్డిగారిపల్లె, కోసువారిపల్లె, కుక్కరాజుపల్లె, రేణుమాకులపల్లె గ్రామాల్లోని మసీదులు,
ఈద్గాల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ముస్లిం సోదరులంతా కలసి మసీదు వద్ద నుంచి ఈద్గాల వరకూ ర్యాలీగా వెళ్లి సామూహిక ప్రార్థనలు చేశారు. రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పేదలకు దానధర్మాలు చేశారు.

సంబంధిత పోస్ట్