తిరుమలలో గురువారం మోస్తరు వర్షం కురిసింది. శ్రీవారి ఆలయం, నాలుగు మడ వీధులు చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలలో వర్షంతో పడుతోంది. లోతట్టు ప్రాంతాలు, రోడ్లు జలమయమయ్యాయి. వైకుంఠం క్యూ లైన్లలో భక్తులు వర్షంలో తడుచుకుంటూ స్వామివారి దర్శనం చేసుకున్నారు. దర్శనం అనంతరం టీటీడీ ఏర్పాటు చేసిన షెడ్లలో తలదాచుకున్నారు. ఘాట్ రోడ్డులో వాహనదారులు నెమ్మదిగా వెళ్లాలని అధికారులు సూచించారు.