తిరుమల: డిప్యూటీ సీఎం పవన్ పై హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు ఆగ్రహం

66చూసినవారు
తిరుమల: డిప్యూటీ సీఎం పవన్ పై హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు ఆగ్రహం
హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు, అంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. తిరుమల శ్రీవారి లడ్డూ వ్యవహారం మీద నోటీసులు తీసుకోకుండా విచారణకు హాజరు కాకపోవడంపై కోర్టు సీరియస్ అయ్యింది. లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు ఉన్నట్టు పవన్ చేసిన నిరాధార ఆరోపణలపై ఇమ్మనేని రామారావు పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు, 22న విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేయగా, పవన్ రాకపోవడంతో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

సంబంధిత పోస్ట్