రాష్ట్ర మంత్రి లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని, విద్యాశాఖ మంత్రిగా ఆయన ఫెయిల్ అయ్యారని మాజీ మంత్రి ఆర్కే రోజా మంగళవారం తిరుపతిలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రశ్నిస్తామని చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ప్రశ్నించడం లేదని ఎద్దేవా చేశారు. ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని ప్రధానికి చేతులు జోడించి చెబుతున్నామని రోజా అన్నారు. పవన్, చంద్రబాబు రాష్ట్రంలో వరుసగా పర్యటనలు చేస్తున్న విషయం తెలిసిందే.