కూటమి ప్రభుత్వంలో మంచి పాలన అందించాలన్నదే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రధాన ఉద్దేశమని తిరుపతి జనసేన ఇన్‌చార్జ్ కిరణ్ రాయల్ అన్నారు. మంగళవారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఆయన మాట్లాడుతూ పిఠాపురంలో పవన్ మాటలపై హోంమంత్రి అనిత స్పందిస్తూ సరిదిద్దుకుంటామన్నారని గుర్తు చేశారు. అయినప్పటికీ వైసీపీ వారు రాజీనామా చేయాలంటూ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. కుటుంబంలో సమస్యలు వచ్చినప్పుడు పరిష్కరించుకోవడం సహజమన్నారు.