Dec 20, 2024, 03:12 IST/
మళ్లీ అజ్ఞాతంలోకి మోహన్ బాబు!
Dec 20, 2024, 03:12 IST
ప్రముఖ నటుడు మంచు మోహన్ బాబు మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. జర్నలిస్ట్‌పై దాడి కేసులో మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదవడంతో ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టులో బాబు పిటిషన్ వేశారు. అరెస్టు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని బాబు తరపు న్యాయవాది కోరారు. అయితే మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని, కౌంటర్ దాఖలు తర్వాతే విచారణ జరిపి నిర్ణయం తీసుకుంటామన్న హైకోర్టు తెలుపడంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. బాబు బెంగళూరులో ఉన్నట్లు పోలీసుల అనుమానం.