ఏపీలోని నూజివీడును స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతామని మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. సోమవారం నూజివీడు మామిడి పరిశోధన కిసాన్ మేళా వర్కుషాప్‌లో ఆయన పాల్గొని మాట్లాడారు. నూజివీడులో ఉన్న రోడ్డు, డ్రైనేజీ సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. నూజివీడు ప్రజలకు పన్నుల భారం తగ్గిస్తామని ఆయన పేర్కొన్నారు. నూజివీడు మామిడి యార్డు అభివృద్ధికి రూ.30 కోట్లు కేటాయించామని మంత్రి వెల్లడించారు.