సంక్రాంతి పండుగ సందర్భంగా వెంకటగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏ. వి రమణ వెంకటగిరి వాసులకు ఆదివారం సాయంత్రం కీలక సూచనలు చేశారు. సెలవుల కారణంగా బయటకు వెళ్లే వారు తమ ఇంట్లో ఎలాంటి నగదును లేదా బంగారాన్ని ఉంచకుండా బ్యాంకు లాకర్లో ఉంచాలని ఆయన తెలిపారు. ఊరికి వెళ్లే విషయం పోలీస్ స్టేషన్ లో సమాచారం ఇవ్వాలన్నారు. సంక్రాంతి పండుగ కారణంగా కోడిపందేల నిర్వహణ వంటి అసాంఘిక కార్యక్రమాలు చట్టరీత్యా నేరమని ఆయన హెచ్చరించారు.