చిత్తూరు జిల్లా, పుంగనూరు నియోజకవర్గంలోని వైష్ణవాలయాలలో పేరిటాసి నెల మొదటి శనివారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా దేవలంపేటలోని శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయం, సదుంలోని కొత్తపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం, సోమలలోని వెంకటేశ్వర స్వామి పాదాలు, చెన్నకేశవ స్వామి ఆలయం, పుంగనూరులోని కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయాలలో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.