వస్త్రాలు,ఆహారం వితరణ చేసిన డా.యం.డి.హెచ్ పవన్ కళ్యాణ్
స్థానిక వి. కోట పట్టణంలో శుక్రవారం ప్రముఖ సమాజ సేవకులు యం. డి. హెచ్ ఫౌండేషన్ అధినేత డా. యం. డి. హెచ్. పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో వి. కోట సాయి గార్డెన్ లో ఉన్నటువంటి ప్రత్యేక ప్రతిభావంతులు గల పిల్లలు ఉన్న ఆదర్శ పాఠశాల విద్యార్థులకు ఆహారం మరియు పాఠశాల సిబ్బందికి వస్త్రాలు అందించారు. సంఘమిత్ర వృద్ధాశ్రమంలో వృద్ధులకు వస్త్రాలు మరియు తినుబండారాలను అందించి వంటకు కావాల్సిన వంట సామాగ్రి అందజేస్తానని పవన్ హామీ ఇచ్చారు.