బాలీవుడ్ నటి కాదంబరీ జెత్వానీ కేసుపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. ఆమెను వేధించిన వారిపై చర్యలు చేపట్టాలని డీజీపీ ద్వారకా తిరుమలరావును ఆదేశించారు. ఆమె నుంచి ఆన్లైన్ ద్వారా ఫిర్యాదును తీసుకోవాలని సూచించారు. వెంటనే సమగ్ర నివేదిక అందించాలని చెప్పారు. దీంతో పోలీసులు కేసు దర్యాప్తులో నిమగ్నం అయ్యారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్లకు నోటీసులు ఇవ్వనున్నారని సమాచారం.