కట్నం కోసం 7 నెలల గర్భిణిని నిప్పంటించి చంపేశారు

75చూసినవారు
కట్నం కోసం 7 నెలల గర్భిణిని నిప్పంటించి చంపేశారు
మధ్యప్రదేశ్ ఉమారియా జిల్లాలో శుక్రవారం దారుణ ఘటన చోటు చేసుకుంది. వరకట్నం కోసం 7 నెలల గర్భిణిని ఆమె భర్త శ్రీకాంత్, అత్తామామలు నిప్పంటించి దారుణంగా చంపేశారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు బాధితురాలిని షాలినీ గౌతమ్‌గా గుర్తించారు. నిందితులు బాధితురాలిని కట్నం కోసం గత కొంతకాలంగా వేధిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై ఆమె భర్తతో పాటు అత్తామామలు, ఇద్దరు ఆడపడచులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్