సీఎం చంద్రబాబు నేతృత్వంలో 9 మంది బృందం దావోస్ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నెల 20 నుంచి 24 వరకు దావోస్‌లో పర్యటించనున్నారు. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగే ప్రపంచ ఆర్ధిక సదస్సు (వరల్డ్ ఎకానామిక్ ఫోరం)లో సీఎం పాల్గొననున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్, పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తదితరులు హాజరు కానున్నారు. ఈ సదస్సులో రాష్ట్రంలోని వనరులు, పెట్టుబడి అవకాశాలను సీఎం వివరించనున్నారు.