శ్రీశైలంలో నేత్రపర్వంగా సంక్రాంతి బ్రహ్మోత్సవాలు

52చూసినవారు
శ్రీశైలంలో నేత్రపర్వంగా సంక్రాంతి బ్రహ్మోత్సవాలు
శ్రీశైలంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం సాయంత్రం భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి భృంగివాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. భక్తుల శివనామస్మరణలతో ఆలయ పరిసరాలు హోరెత్తాయి. చెంచుకళాకారుల జానపదాలు, కోలాటాలు, హరిదాసులు విన్యాసాలతో సందడిగా ఉత్సవం సాగింది. ఇక, సోమవారం భోగి పండుగను సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్నట్లు ఈవో శ్రీనివాసరావు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్