మహారాష్ట్రలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయంతో శరద్ పవార్ రాజకీయాలకు తెర పడినట్లయిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఎన్‌సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్‌పై ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మహారాష్ట్రలో 1978 నుంచి పవార్ ఓ రకమైన రాజకీయాలు చేశారని, వాటికి ఇప్పుడు తెరపడిందన్నారు. తద్వారా రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న తమ సంకల్పం నెరవేరిందని చెప్పారు.