TG: నాగర్ కర్నూల్ మాజీ ఎంపీ మందా జగన్నాథం మృతిపై ఏపీ సీఎం చంద్రబాబు సంతాపం తెలిపారు. నాలుగు సార్లు లోక్ సభకు ఎన్నికైన జగన్నాథం.. రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారని పేర్కొన్నారు. టీడీపీ నుంచి మూడు సార్లు ఎంపీగా గెలిచి ప్రజా సేవ చేశారని గుర్తు చేసుకున్నారు. జగన్నాథం కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.